ప్రకాశం: ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కె. విజయ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎ. జనార్ధన్ ఇవాళ చీమకుర్తి ఎక్సైజ్ స్టేషన్ తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులు, సీజ్ వాహనాలను త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. అనంతరం మద్యం దుకాణాలను తనిఖీ చేసి MRP ధరలకు మాత్రమే అమ్మకాలు జరపాలని చెప్పారు. ఎక్సైజ్ CI సుకన్య, SI నగేష్ పాల్గొన్నారు.