RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ పంచాయతీకి అభివృద్ధిలో సహకరించాలని జీఎంఆర్ టోల్ ప్లాజా మేనేజర్ ఇబ్రహీంకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలో అత్యవసరమైన కంప్యూటర్, ప్రింటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.