ASF: పోడు భూముల రైతులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెట్టొద్దని కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్యామ్ నాయక్ కోరారు. మంగళవారం రెబ్బెన మండలం తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన పోడు రైతులు శ్యామ్ నాయక్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వ్యవసాయం చేసుకుంటున్న తమను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.