BDK: టేకులపల్లి మండలం రోళ్ళపాడు గ్రామంలోని MPPS పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల భవనం, ఆవరణ, తరగతి గదులు, పరిశుభ్రతా స్థితిని పరిశీలించారు. విద్యార్థులతో సూటిగా మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, పాఠశాలలో అందిస్తున్న మిడ్-డే మీల్ నాణ్యత, వసతుల గురించి తెలుసుకున్నారు.