MDK: మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు పెంటయ్యకు గాయాలయ్యాయి. ఎరువుల దుకాణం నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, మెదక్ డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో పెంటయ్యకు గాయాలవడమే కాకుండా, ఆర్టీసీ డ్రైవర్ స్వామి గాయపడిన వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.