SKLM: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 18 నుంచి 28 ఏళ్ల వయసు గల యువతీ, యువకులు, 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు.