ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించారు. కాసేపట్లో ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, NDA నుంచి రాధాకృష్ణన్ బరిలో ఉండగా.. ఇండి కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. మొత్తం 781 మంది ఓటర్లు ఉండగా.. 760 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, 440కి పైగా ఓట్లతో రాధాకృష్ణన్ గెలుస్తారని NDA భావిస్తోంది.