TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నగరంలో ఏర్పాట్లు పక్కాగా చేయాలని, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నగరపాలక సంస్థ, టీటీడీ అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో టీటీడీ నగరపాలక సంస్థ అధికారులు సమన్వయం చేసుకొని పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలన్నారు.