అన్నమయ్య: రాయచోటి డైట్లో మంగళవారం నూతన విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రెండవ సంవత్సరం విద్యార్థులు కొత్తవారికి స్వాగతం పలికారు. డీఈవో, డైట్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. భవిష్యత్తు ఉపాధ్యాయుల స్ఫూర్తి ఇక్కడే ఆవిష్కృతమవుతుందని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి ఇలాంటి కార్యక్రమాల వల్ల కొత్తవారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు.