NLG: MVR విద్యా సంస్థల అధినేత, కొలనుపాక రవికుమార్ మాతృమూర్తి కొలనుపాక సరళా దేవి ఇవాళ పరమదించారు. విషయం తెలుసుకున్న మాజీ MLA భూపాల్ రెడ్డి ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా, కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు నల్గొండ పట్టణ BRS పార్టీ నాయకులు ఉన్నారు.