వాటర్ యాపిల్స్ పండ్లలో అధిక నీటి శాతం, విటమిన్ C వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు వీటిని తింటే మంచిది. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.