KNR: ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కవిత్వం, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణరావు 111వ జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.