KRNL: ఆదోనిలో జరుగుతున్న ఇసుక దోపిడీని ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే పార్థసారథి తెలియజేశారు. ఇవాళ ఇసుక తోలే టిప్పర్ ఓనర్లు అంతా కలసి ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని కలిసి మంత్రాలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇసుక రీచులలో ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతుందో ఎమ్మెల్యేకు వివరించారు.