CTR: బంగారుపాలెం మండలం ఎగువ ఎద్దులవారిపల్లి దళితవాడకు చెందిన సంధ్య (24) మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆమె ఈ నెల 6వ తేదీన డ్యూటీకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల గాలించినప్పటికీ ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో ఇవాళ ఆమె భర్త హేమచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తామని తెలిపారు.