VSP: గాజువాకలోని పెద గంట్యాడలో లంబోదర శ్రీ శక్తి టిడ్కో మహిళా సంఘం సభ్యులకు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ గుర్తింపు కార్డులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలపై ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు జి. ఆనంద్, పెదపూడి దుర్గా రావుతో పాటు సంఘం అధ్యక్షురాలు రమణి, కార్యదర్శి పీత లక్ష్మి పాల్గొన్నారు.