NLG: తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం, పట్టణ కార్యదర్శి దండంపెల్లి సత్తయ్యలు పేర్కొన్నారు. నల్గొండలో మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 10 నుండి 17 వరకు జరిగే పోరాట వారోత్సవాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.