NZB: మోర్తాడ్ మండల కేంద్రంలోని గోర్లు మేకలకు మంగళవారం పీ.పీ.ఆర్(పరుడు వ్యాధి) నివారణ టీకాలు పంపిణీ చేసినట్లు పశు వైద్యాధికారి డా.గౌతమ్ రాజు తెలిపారు. గ్రామంలోని 450 గొర్రెలు 140 మేకలకు ఉచితంగా పీపీఆర్ వ్యాధి నివారణ టీకాల పంపిణీ చేశారు. ఆరు నెలలకు ఒకసారి పాడి పశువుల పెంపకం దారులకు ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేస్తునట్లు చెప్పారు.