TPT: సముద్రతీర ప్రాంతాల వద్ద భద్రత ఏర్పాట్లను సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో చేపట్టాలని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. విశాఖపట్నం డిప్యూటీ ఎస్పీ, కోస్టల్ సెక్యూరిటీ పోలీసుల సూచనలు మేరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు తమ వెంట ఆధార్ కార్డు తీసుకెళ్లాలన్నారు. తూపిలి, దుగ్గరాజుపట్నం బీచ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.