తూ.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి & సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి మంగళవారం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలోని మానసిక చికిత్స కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగుల వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. మానసిక రుగ్మతల నుంచి కోలుకున్న వారిని కుటుంబసభ్యులతో తిరిగి కలిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.