NLG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్లోని జలసౌధలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అన్ని నీటిపారుదల ప్రాజెక్టులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో పాటు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.