VSP: దక్షిణ నియోజకవర్గం 39వ వార్డుకు చెందిన క్యాన్సర్ పేషెంట్ మహమ్మద్ రహమతుల్లాకు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ మంగళవారం రూ.5000 ఆర్థిక సహాయం అందించారు. 39వ వార్డు అధ్యక్షుడు ముజీబుఖాన్ సూచనతో ఇంటికి వెళ్లి పరామర్శించిన వాసుపల్లి, పేదలకు తన సొంత నిధులతో మెడికల్ సాయం కొనసాగిస్తానని తెలిపారు.