NTR: కంచికచర్ల మండలం గని ఆత్కూరుకు చెందిన దంపతులు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామం వద్ద శ్రీనివాస్, రజనీ దంపతులు బైక్పై వెళ్తుండగా, కంచికచర్ల నుంచి వస్తున్న కోళ్ల దాణా లారీ వారిని ఢీట్టింది. ఈ ఘటనలో భార్యా భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.