AP: వ్యవసాయ, జలవనరులశాఖను మాజీ సీఎం జగన్ విధ్వంసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ‘కాలువలు, డ్రైన్లు, ప్రాజెక్టు నిర్వహణను జగన్ అటకెక్కించారు. జగన్ హయాంలో పంటలకు బీమా కట్టలేదు. పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను ధ్వంసం చేశారు. యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. రైతులకు యూరియా అందలేదంటూ.. YCP అసత్యాలు చెబుతోంది’ అని మండిపడ్డారు.