NRML: బాసర ఆర్జీయూకేటీలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల కన్నీళ్లకు తన అక్షరాలను చైతన్య పరిచిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 111వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో VC ప్రొ. గోవర్ధన్, ప్రొ. మురళీధర్శన్ పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అయన చేసిన సేవలు, రచనల గురించి విద్యార్థులకు తెలియజేశారు.