VSP: మహిళలు, పిల్లలపై జరిగే అఘాయిత్యాలను సహించబోమని, దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం చినగదిలి మండలం దీన్ దయాళ్ పురంలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన బాలల సంక్షేమ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణబాబు పాల్గొన్నారు.