NZB: బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన బీనోల సొసైటీ ఛైర్మన్ మగ్గరి హన్మండ్లు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ లేఖను పోస్టు ద్వారా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పంపించారు. నాయకురాలు కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు.