ప్రకాశం: మర్రిపూడి మండలంలోని తంగళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన హిందీ ఉపాధ్యాయులు గుంటగాని భాస్కరరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. అదేవిధంగా శ్రీనివాసులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కావడంతో అవార్డు గ్రహీతలైన ఉపాధ్యాయులను తంగెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రంగయ్య, శ్రీనివాసులు అభినందించారు.