W.G: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలో జిల్లా రూరల్ వాటర్ స్కీమ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆర్డబ్ల్యూయస్ ఈఈ) కె శ్రీనివాస్ మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబును కలిశారు. అలాగే జిల్లాలో కొత్తగా చేపడుతున్న పనులపై సమీక్షించారు.