KMM: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మంగళవారం పార్లమెంట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటేశాక స్పీకర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కె.రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్ ఉన్నారు.