SKLM: జిల్లేడు ద్రావణం పిచికారీ చేయడం వలన పంటకు ఆశించే అనేక తెగుళ్లను నివారించుకోవచ్చని ప్రకృతి వ్యవసాయం ఐ.సీ.ఆర్.పీలు కే.భూదేవి, చిన్న అన్నారు. కొత్తూరులోని పారాపురంలో మంగళవారం జిల్లేడు ద్రావణం తయారీపై రైతులకు అవగాహన కలిగించారు. సహజ సిద్ధంగా మనకు లభించే జిల్లేడు కొమ్మలతో ఈ ద్రావణం తయారు చేసుకుని పంటకు పురుగుల మందు ఖర్చు తగ్గుతుందన్నారు.