SRD: జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల కోసం 3.30 కోట్ల రూపాయల నిధులు మంజూరైననట్లు జిల్లా అధికారి అఖిలేష్ రెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నిధులతో వసతి గృహాల్లో పెయింటింగ్, మరమ్మతులు, టాయిలెట్లు, మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు.