HYD: నగర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ బృందం మంగళవారం నిర్వహించిన తనిఖీలలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కొంపల్లి, మేడిపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, వనస్థలిపురం, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనేక చోట్ల హోటల్, రెస్టారెంట్లలో అపరిశుభ్రత, కుళ్లిన మాంసం, ఎలుకల మలం, సరాల అపరిశుభ్రత, తేదీ గడిచిన పదార్థాలు గుర్తించి నోటీసులు జారీ చేశారు.