NTR: విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శీనా నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, అర్చకులు పాల్గొన్నారు.