GNTR: విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం అర్చకులు సీఎంని ఆశీర్వదించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.