అన్నమయ్య: జిల్లా సంబేపల్లి వద్ద బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జాలరి చల్లా రామాంజులు (52) మృతి చెందారు. గుట్టపల్లి వద్ద షీట్స్ లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో లారీ రోడ్డుపైనే ఆగింది. అదే సమయంలో చేపల వేటకు వెళ్తున్న రామాంజులు తన బైక్‌తో లారీని ఢీకొని అక్కడికక్కడే మరణించారు. కాగా, పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.