NLG: చాకలి ఐలమ్మ ధైర్యసహసాలు, పోరాట పటిమ నేటి మహిళలకు ఆదర్శప్రాయమని చిట్యాల మండలం ఉరుమడ్ల రజక సంఘం అధ్యక్షుడు చెరుకు సైదులు అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బుధవారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, పల్లపు బుద్ధుడు, శ్రీను, రామకృష్ణ, లింగయ్య పాల్గొన్నారు.