JGL: జగిత్యాల జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తారక రాంనగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆడపిల్లల్లో ఎదురవుతున్న రక్తహీనత, రుతుక్రమ శుభ్రత విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. పాఠశాలలోని బాలికలకు శానిటరీ పాడ్స్ అందజేశారు. కార్యక్రమంలో హారిణి (రిసోర్స్ పర్సన్), మహేష్ తదితరులు పాల్గొన్నారు.