GNTR: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రకార్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.