VSP: మానసిక అనారోగ్య కారణాలతో వివాహిత భవనంపై నుంచి దూకి బుధవారం తెల్లవారజామున ఆత్మహత్య చేసుకుంది. వడ్లపూడికి చెందిన ప్రత్యూషకు రాంబిల్లికి చెందిన సతీశ్‌తో వివాహం కాగా కూర్మన్నపాలెంలోని అద్దెకి ఉంటున్నారు. మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతున్న ఆమె ఆత్మహత్య చేసుకుందని దువ్వాడ సిఐ మల్లేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.