BDK: కిన్నెరసాని పరివాహక ప్రాంతమైన బుడ్డగూడెం గ్రామం నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఓ లారీని బూర్గంపాడు అదనపు ఎస్సై నాగబిక్షం పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు అడ్డుకున్నారు. లారీ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకోగా, లారీని ఠాణాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.