NZM: తెలంగాణ విశ్వవిద్యాలయం (తెవివి) పరిధిలోని 2021, 2022 ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షల రీవాల్యుయేషన్కు దరఖాస్తు గడువు ఈనెల 17వ తేదీ వరకు ఉంటుందని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఓఈ) ఆచార్య సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అప్లికేషన్లను ఈ నెల 18లోపు యూనివర్సిటీలో సమర్పించాలని విద్యార్థులకు సూచించారు. పూర్తి వివరాలకు తెవివి వెబ్సైట్ను సందర్శించగలరని సూచించారు.