NLR: జలదంకి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్‌ను మంగళవారం డైట్ లెక్చరర్ పద్మజ పర్యవేక్షించారు. చుట్టూ ఉన్న పాఠశాల పరిసరాలు బాగున్నాయని ఆమె తెలియజేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంపై ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.