వాణిజ్య అడ్డంకుల పరిష్కారానికి తన మిత్రుడైన ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దీనిపై మోదీ స్పందించారు. ‘భారత్, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్. మన మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలో తొలగిపోతాయని.. ఇరు దేశాల సంబంధాలు బలపడతాయని ఆశిస్తున్నా. నేను కూడా ట్రంప్‌తో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నా’ అని మోదీ తెలిపారు.