CTR: బంగారుపాలెం మండలం వెలుతురుచేను గ్రామానికి చెందిన సుందరం కుటుంబంపై మూకుమ్మడి దాడి జరిగినట్లు SI ప్రసాద్ తెలిపారు. ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, ఇందుకు కారణం సుందరం అని భావించిన మృతుడి కుటుంబ సభ్యులు ఆయన ఇంటిపై దాడి చేసి గడ్డివామును తగలబెట్టారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసులు నమోదు చేసి వారిని రిమాండ్కు పంపించినట్లు SI తెలిపారు.