NZB: ఎడపల్లి మండలం జాన్కంపేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నేడు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఫైరింగ్ శిక్షణ ఉంటుందని ఎస్సై ముత్యాల రమ మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ సమయంలో ప్రజలు, ముఖ్యంగా పశువుల కాపర్లు, రైతులు శిక్షణ స్థలం వైపు వెళ్లవద్దని ఆమె హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.