KMR: అధికారులు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గ్రామ పాలన అధికారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ క్లస్టర్ల వారీగా నియామక పత్రాలను మంగళవారం అందజేశారు. కేటాయించిన క్లస్టర్లలో రెవెన్యూ విధులుసక్రమంగా నిర్వహించి, ప్రభుత్వ భూముల సంరక్షణ, భూభారతి చట్టం అమలులో సమర్థవంతం పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు.