NLR: ఉదయగిరిలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన బెంగుళూరు ఎయిర్పోర్ట్లో ఉదయగిరి నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. గ్రామాల్లోకి పార్టీని తీసుకువెళ్లాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టే పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు.