TPT: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ హీరో శ్రీరామ్ దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ బ్రేక్‌దర్శనం లో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల హీరో శ్రీరామ్‌తో సెల్ఫీ దిగడానికి భక్తులు ఎగబడారు.