KMM: పాలేరు నియోజకవర్గంలో యూరియా పంపిణీలో సమస్యలు రాకుండా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి యూరియా పంపిణీపై సమీక్షించిన ఆయన PACS ద్వారా పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 610 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని అధికారులు చెప్పారు.