జమ్మలమడుగు బైపాస్ తాడపత్రి వెళ్లే రహదారిలో బుధవారం తెల్లవారుజామున గొర్రెలు మందపైకి లారీ దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఓ కాపరి మృతి చెందాడు. నరసింహులు అనే వ్యక్తి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా వారిని జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి, మృతుడిది నంద్యాల జిల్లా రుద్రవరం మండలం. గొర్రెలు తోలుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగింది.